ప్రభాస్ అభిమానులు ఇంకొద్దికాలం ఎదురుచూడాల్సిందేనా ?

ప్రభాస్ అభిమానులు ఇంకొద్దికాలం ఎదురుచూడాల్సిందేనా ?

Published on Feb 4, 2018 1:38 PM IST

ఐదేళ్ల ‘బాహుబలి’ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితం మొదలైనా ఇప్పటికీ విడుదలపై పూర్తిస్థాయి క్లారిటీ రాలేదు. ముందుగా 2018లోనే రిలీజవుంతుందని చిత్ర యూనిట్ తెలిపినా ఇప్పుడు మాత్రం విడుదల వచ్చే ఏడాదేనని వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాతలు సినిమాను 2019 సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారని, పైగా సినిమా మేకింగ్ కు ఎక్కువ సమయమే పడుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలు నిజమో లేకపోతే ఒట్టి పుకార్లో తెలియాలంటే మేకర్స్ ఒక స్పష్టమైన ప్రకటనను విడుదలచేస్తే బాగుంటుంది. ఇకపోతే ఈ నెలాఖరు నుండి సుమారు రెండు నెలలపాటు చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరగనుంది. అక్కడే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలని షూట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు