ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు సినిమా సాహో నే

Published on Aug 23, 2019 9:25 am IST

సాహో విడుదలకు ముందే అనేక సంచలనాలు నమోదు చేస్తూ తన సత్తా చాటుతుంది. ప్రీ రిలీజ్ బిసినెస్ తోనే దుమ్మురేపిన సాహో అదే స్థాయిలో అడ్వాన్సు బుకింగ్స్ విషయంలో జోరుచూపిస్తుంది. అలాగే పారిస్ లో గల ది గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శితమవుతున్న ప్రభాస్ రెండో సినిమాగా రికార్డులకెక్కింది. తాజాగా సాహో ట్విట్టర్ ఎమోజి సింబల్ పొంది మరో ఘనతను అందుకుంది.

ప్రముఖ సోషల్ మీడియా అయిన ట్విట్టర్ కొన్ని ప్రధాన చిత్రాలకు ఎమోజీలు తయారు చేస్తుంది. ది లయన్ కింగ్, అవెంజర్స్, స్పైడర్ మాన్, సల్మాన్ భారత్ వంటి చిత్రాలకు ఎమోజిలు తయారుచేసింది. ఇప్పుడు సాహో చిత్రానికి కూడా ట్విట్టర్ ఎమోజి ఇవ్వడం జరిగింది. ట్విట్టర్ ఎమోజి పొందిన మొదటి తెలుగు సినిమా సాహో కావడం గమనార్హం. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా తెరకెక్కిన సాహో ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :