గూస్ బంప్స్ కలిగేలా సాహో కొత్త పోస్టర్…!

Published on Jul 25, 2019 1:23 pm IST

“సాహో” విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ మూవీకి భారీ ప్రచారం కల్పిచే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంలో ఒక్కొక్కటిగా “సాహో” మూవీ పోస్టర్స్ విడుదల చేస్తూ మూవీ పై బజ్ క్రియేట్ చేస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం ప్రభాస్,శ్రద్దా కపూర్ ల రొమాంటిక్ పోజ్ లో ఉన్న క్లోజ్ అప్ పోస్టర్స్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం మరో పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ సారి యాక్షన్ ఓరియెంట్ పోస్టర్ ని విడుదల చేశారు. ప్రభాస్ ,శ్రద్దా కపూర్ ఫుల్లీ ఆర్మ్డ్ టీం తో పేస్ టు పేస్ గన్ ఫైట్ లో తలపడుతున్నట్లున్న ఆ పోస్టర్ రోమాంచితంగా ఉంది. ప్రభాస్ కి సరిసమానంగా శ్రద్దా కపూర్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఈ పోస్టర్ చుస్తే అర్థం అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 30న తెలుగు,తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :