సాహో ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్రభాస్ !

Published on May 2, 2019 4:55 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. గత కొద్దీ రోజులుగా ఈచిత్రం యొక్క షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఇక ఇటీవల ఈ షెడ్యూల్ లో జాయిన్ అయిన ప్రభాస్ ఈరోజు తన పాత్ర తాలుకు షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు లో ఆమె కు ఇదే మొదటి చిత్రం. ‘రన్రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఆగష్టు 15న ఈచిత్రం విడుదలకానుండగా హిందీ లో ఈ చిత్రాన్ని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ విడుదలచేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More