“సాహో” న్యూ పోస్టర్, ప్రభాస్ రొమాంటిక్ యాంగిల్

Published on Jul 23, 2019 10:18 am IST

ఫాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ “సాహో” మూవీ ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు,తమిళ,హిందీ భాషలలో భారీగా విడుదల కానుంది.ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాలతో విడుదల తేదీ కొద్దిరోజులు రోజులు వెనక్కి జరిపారు. యూవీ క్రియేషన్,టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నారు.

కాగా “సాహో” మూవీ కొత్త విడుదల తేదీతో కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ప్రభాస్,శ్రద్దా కపూర్ లు రొమాంటిక్ పోజ్ లో ఉన్న క్లోజ్ అప్ షాట్ కేక అని చెప్పాలి. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న “సాహో” చిత్రంలో తగిన పాళ్ళలో రొమాన్స్ కూడా ఉందనిపిస్తుంది. నీల్ నితిన్ ముకేశ్,జాకీ ష్రాఫ్, మురళి శర్మ,వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :