‘రన్ రాజా రన్’ ఫెమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. మూడు రోజుల క్రితం ఈచిత్రం యొక్క ముఖ్యమైన షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. దాదాపు 40 రోజుల పాటు జరుగనుంది ఈ షెడ్యూల్.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహసాన్ -లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


