జూన్ 2వ వారంలో ‘సాహో’ కొత్త షెడ్యూల్ !

Published on May 26, 2018 1:19 pm IST

ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ కొద్దిరోజుల క్రితమే క్లిష్టమైన, అతి ముఖ్యమైన దుబాయ్ షెడ్యూల్ ను ముగించుకుంది. రూ.90 కోట్ల భారీ వ్యయంతో జరిపిన ఈ దుబాయ్ చిత్రీకరణలో హెవీ ఛేజింగ్ సన్నివేశాలను షూట్ చేశారు. కెన్నీ బేట్స్ రూపొందించిన యాక్షన్ సీన్స్ ఇదివరకెన్నడూ ఇండియన్ స్క్రీన్ మీద చూడని స్థాయిలో ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ప్రస్తుతం విరామంలో ఉన్న టీమ్ తిరిగి జూన్ 2వ వారంలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తున్న తొలి చిత్రం కావడంతో అనేక పరిశ్రమల ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :