సాహో’ నిర్మాతల చేతికి ‘సైరా’ ?

Published on Jul 10, 2019 1:05 am IST

భారీ వ్యయంతో ‘సాహో’ లాంటి సినిమాల్ని రూపొందించే నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా తనదైన మార్క్ చూపుతోంది. సొంత సినిమాలనే కాకుండా వేరే భారీ చిత్రాలను కూడా పంపిణీ చేస్తోంది. తాజా సమాచారం మేరకు ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న భారీ చిత్రాల్లో ఒకటైన మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను యూవీ క్రియేషన్స్ సొంతం చేసుకుందని టాక్.

అది కూడా ఆంధ్రా రీజియన్ మొత్తానికి కావడం విశేషం. భారీ వ్యయం చెల్లించి ఈ హక్కుల్ని కొనుగోలు చేశారట. అయితే అటు కొణిదెల ప్రొడక్షన్స్ కానీ ఇటు యూవీ క్రియేషన్స్ సంస్థ కానీ ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఇకపోతే ‘సైరా’ కర్ణాటక రైట్స్ ఇటీవలే భారీ మొత్తానికి అమ్ముడవగా డిజిటల్ రైట్స్ సైతం ఎక్కువ మొత్తానికి అమ్ముడైన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More