‘సాహో’కి స్పేస్ ఇచ్చినందుకు కృతజ్ఞలు.

Published on Aug 6, 2019 11:10 am IST

నేడు ఉదయం ‘సాహో’ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టడం జరిగింది. ‘సాహో’ విడుదల తేదీని ఆగస్టు15 నుండి, 30కి మార్చిన సంగతి తెలిసిందే. దీనితో ఆగస్టు 30న విడుదల చేయాలని భావించిన కొన్ని చిత్రాల విడుదల తేదీలను మార్చడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా ‘సాహో’ మూవీ నిర్మాతలు సదరు మూవీ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ నోట్ విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషలలో సాహో విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు,హిందీ,తమిళ,మళయాళ భాషలలో తమ చిత్రాల విడుదల తేదీలను వాయిదా వేసుకున్న నిర్మాతలకు ధన్యవాదాలు వ్యక్తం చేశారు.

తెలుగులో నాని ‘గ్యాంగ్ లీడర్’, తమిళంలో సూర్య నటించిన ‘కాప్పాన్’ చిత్రాల విడుదల ‘సాహో’ కారణంగా వాయిదావేయడం జరిగింది. నిజానికి ఈ రెండు చిత్రాలు ఆగస్టు 30ని విడుదల తేదీగా ప్రకటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :