‘సాహో’.. ముంబైలో పూర్తి చేశాడు, హైదరాబాద్ లో మెదలెట్టనున్నాడు !

Published on May 4, 2019 3:00 am IST

సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా రాబోతున్న భారీ చిత్రం ‘సాహో’. మూడు వారాల పాటు ముంబైలో కీలక షెడ్యూల్ కు సంబంధించి షూటింగ్ ను జరుపుకున్న ఈ చిత్రం అక్కడ షూటింగ్ ను పుర్తి చేసుకుంది. త్వరలో హైదరాబాద్ లో ఫ్యాచ్ వర్క్ కు సంబధించిన షూట్ మొదలుకానుంది. ఇక సాహో చిత్రబృందం త్వరలో యూరప్ వెళ్లనుంది. శ్రద్ధా కపూర్ -ప్రభాస్ ఇద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ ను అక్కడ షూట్ చేస్తారట.

ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాలోని విజువల్స్ నుంచి ప్రభాస్ యాక్షన్ సీన్స్ వరకూ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట. చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం :

More