‘సాహో’ టీమ్ ప్లన్స్ మామూలుగా లేవుగా

Published on Jul 21, 2019 5:44 pm IST

300 కోట్ల భారీ వ్యవయంతో నిర్మితమైన చిత్రం ‘సాహో’ విడుదల సన్నాహాల్లో ఉంది. ముందుగా చిత్రాన్ని ఆగష్టు 15న విడుదలచేయాలని అనుకున్నా దాన్ని ఆగష్టు 30కి వాయిదావేశారు. ఈ వాయిదా పట్ల అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురైనా మెల్లగా సర్దుకున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఇక ఆలస్యమైతే బాగుండదని ప్రమోషన్లకు సన్నాహాలు చేస్తున్నారు.

చిత్రం ఎంత భారీ స్థాయిలో ఉంటుందో ప్రచార కాయక్రమాలు కూడా అంతే భారీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే సినిమాలో ప్రభాస్ ప్రత్యేకంగా వాడిన రూ.5 కోట్ల విలువ చేసే కారును, ఖరీదైన స్పోర్ట్స్ బైకులను రంగంలోకి దించుతున్నారని టాక్. వీటిని ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకొచ్చి చిత్రం ఎంత భారీగా, ఖరీదుగా ఉంటుందో చెప్పాలనేది టీమ్ ప్రయత్నమట. అంతేకాదు ప్రీ రిలీజ్ వేడుకను కూడా నభూతో నభవిష్యత్ అనే రీతిలో జరపాలని చూస్తున్నారట.

సంబంధిత సమాచారం :