నెంబర్ వన్ స్థానంలో “సాహో” తెలుగు వెర్షన్.!

Published on Aug 22, 2019 3:00 am IST

భారతదేశ వ్యాప్తంగా సాహో ఫీవర్ మరింత ఎక్కువయ్యింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకతంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విడుదల కాబోతున్న అన్ని భాషల్లోనూ సాహో విడుదల కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.పోస్టర్ల నుంచి ఇటీవలే విడుదల అయిన ట్రైలర్ మరియు బ్యాడ్ బాయ్ సాంగ్ వరకు ప్రతీ ఒక్క అంశం కూడా సాహో పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి తప్ప ఏమాత్రం తగ్గించలేదు.

అయితే సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యిన తర్వాత తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రతీ ఒక్క అంశాన్ని అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.అలాగే సాహో ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.సాహో ట్రైలర్ కంటే టీజర్ తో ప్రకంపనలు రేపిన సంగతి అందరికి తెలిసిందే.ఈ టీజర్ కు గాను 24 గంటలు పూర్తయ్యే సరికి ఒక్క తెలుగు వెర్షన్ లోనే మొత్తం 4 లక్షల 55వేలు లైక్స్ సంపాదించుకుంది.

ఇప్పటి వరకు విడుదలైన ఏ టీజర్ కూడా మళ్ళీ రికార్దును అందుకోలేకపోయిందని ప్రస్తుతానికి నెంబర్ 1 స్థానంలో అయితే “సాహో”నే ఉందని అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు దాదాపు 350 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆగష్టు 30వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :