సాహో విడుదలతేదీ ఫిక్స్ !

సాహో విడుదలతేదీ ఫిక్స్ !

Published on Dec 17, 2018 2:22 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ ఇటీవలే మూడవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల తేదీ ని ఖరారు చేశారు చిత్ర బృందం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య దినోత్సవం రోజున విడుదలకానుంది.

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా భారీ వీఎఫ్ఎక్స్ తో రానుంది ఈచిత్రం

ఇక ప్రభాస్ ఈ చిత్రం తో పాటు తన 20వ చిత్రం లో కూడా నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈచిత్రం కూడా వచ్చే ఏడాది చివర్లలో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు