కిక్కెక్కించే సాహో ట్రైలర్ డేట్ వచ్చేసింది.

Published on Aug 8, 2019 11:22 am IST

ప్రభాస్ తన డార్లింగ్స్ కొరకు నేడు సరికొత్త న్యూస్ తో వచ్చేశాడు. ఎప్పుడా..,ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరదించుతూ “సాహో” మూవీ ట్రైలర్ డేట్ ప్రకటించేశారు. ఈనెల 10న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనిని ధృవీకరిస్తూ “సాహో” యూనిట్ కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

డార్క్ షేడ్ బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ లో వన్ సైడ్ ప్రొఫైల్ లో ఉన్న ప్రభాస్ లుక్ తో విడుదలైన ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. గతంలో విడుదలైన 1.40నిమిషాల నిడివి గల టీజర్ లో కొంచెం రొమాన్స్, మిగతా అంతా యాక్షన్ సన్నివేశాలతో అలరించిన “సాహో” టీమ్, ట్రైలర్ లో ఇంకెంత హై వోల్టేజ్ యాక్షన్ పరిచయం చేయనున్నారో అని అభిమానులతో పాటు, సినీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఏదిఏమైనా “సాహో” ట్రైలర్ టీజర్ కి మించి ఉంటుంది అనడంతో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

More