ట్రైలర్ సమీక్ష : సాహో- ఇంటెలిజెంట్ సూపర్ థీఫ్ స్టోరీ

Published on Aug 10, 2019 5:43 pm IST

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్ విడుదలైంది .భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మూవీ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఫ్యాన్స్ అలాగే పరిశ్రమ వర్గాల ఆతృతను తెరదించుతూ కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉందో సమీక్షిద్దాం.

ట్రైలర్ మొదలవడంతోనే ముంబై లో జరిగిన రెండువేల కోట్లకు సంబందించిన ఓ భారీ దొంగతనం గురించి చెబుతుండటంతో పాటు,ఆ తదుపరి క్షణంలో వచ్చే సన్నివేశంతో ప్రభాస్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టే సూపర్ దొంగగా కనిపించనున్నారన్న విషయం స్పష్టం అవుతుంది. బహుశా వెన్నెల కిషోర్ ప్రభాస్ అసిస్టెంట్ పాత్రలో చేసే అవకాశం కలదు. ఇక హీరోయిన్ శ్రాద్దా కపూర్ అమృతా నాయర్ అనే పేరు కలిగిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. అలాగే మరో నటుడు మురళి శర్మ సాహో కేసుని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ గా కనిపిస్తున్నారు.

ఇక ప్రధాన కథ మొత్తం వాజా సిటీలోని ఓ పెద్ద లాకర్ లో గల నిధి విషయంలో అక్కడి డేంజరస్ మాఫియా లీడర్స్ కి సాహో మధ్య నడిచే ఆధిపత్య పోరులా అనిపిస్తుంది. చుంకి పాండే,జాకీ ష్రాఫ్,లాల్, మొదలైన వారు మాఫియా లీడర్స్ లా కనిపిస్తున్నారు.

ఇక శ్రద్దా కపూర్,ప్రభాస్ ల కెమిస్ట్రీ విషయానికి వస్తే ప్రభాస్, పోలీస్ అయిన శ్రద్దాను తన ప్రయోజనం కోసం మోసం చేస్తాడని ట్రైలర్లో వచ్చిన చివరి సన్నివేశం ద్వారా అర్థం అవుతుంది. గుండెల్లో ఏమిలేదు, అంతా మైండ్ లోనే ఉంది అని అర్థం వచ్చేలా ఉన్న ఆ సన్నివేశం సాహోకి స్వార్ధం తప్పా, మనసు లేని మనిషి అని వ్యక్తం అవుతుంది. ఇక మనం డే అండ్ నైట్ లాగా ఒకరు వస్తే ఇంకొకరు వెళ్ళిపోవాలి అని చెప్పడంలో నువ్వు ఒక దొంగ,నేను ఒక పోలీస్ కలవడం కుదరదు అని అర్థం వచ్చేలా ఉంది. ఇక ప్రభాస్ పూర్తిగా దొంగా లేక, మాఫియా అంతుచూడటానికి అండర్ కవర్ లో ఉన్న పోలీసా అనేది ట్విస్ట్.

మూవీ విజువల్స్ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. జిబ్రాన్ బీజీఎమ్ ట్రైలర్ ని మరో స్థాయికి చేర్చింది. ఇక సాహో అభిమానులు ఈనెల 30న వచ్చే ఫుల్ ట్రీట్ కొరకు ఎదురుచూడటమే.

యూవీ క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా,జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్,అరుణ్ విజయ్,లాల్,జాకీ ష్రాఫ్,మురళి శర్మ,వెన్నెల కిషోర్,చుంకీ పాండే,మహేష్ మంజ్రేకర్,మందిరా బేడీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈనెల 30న తెలుగు,హిందీ,తమిళ, మలయాళ నాలుగు ప్రధాన భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :