సాహో ట్రైలర్ లోనైనా ఆ విషయం చెవుతారా?

Published on Aug 10, 2019 8:30 am IST

ఇంకా కొన్ని గంటలలో దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్ విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మూవీ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ అలాగే పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వినూత్నంగా ఈ మూవీ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శను ఇవ్వనున్నారు. కాగా సాహో మూవీలో ప్రభాస్ పాత్రపై ఇప్పటికీ సస్పెన్సు కొనసాగుతూనే ఉంది.

కొద్దిరోజులుగా మూవీలోని ప్రధాన ప్రతినాయకుల పాత్రలతోపాటు, కీలక పాత్రలు చేస్తున్న మురళీ శర్మ,మందిరా బేడీ, ఎవ్లీన్ శర్మ వంటి నటుల లుక్స్ తో పాటు వారి పాత్ర తీరును తెలియజేసేలా ఓ ఇంగ్లీష్ లైన్ తో పోస్టర్స్ విడుదల చేశారు. ఐతే హీరో ప్రభాస్ పాత్రపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు. ప్రభాస్ అండర్ కవర్ కాప్ అని కొందరు అంటుంటే, మరికొందరు సూపర్ థీఫ్ అని కొందరు అంటున్నారు. గతంలో విడుదలైన టీజర్ లో కూడా ఈ విషయంపై స్పష్టత లేకపోవడంతో కనీసం ట్రైలర్ లో నైనా ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుందని కొందరు భావిస్తున్నాడు. మరి దర్శకుడు సుజీత్ ట్రైలర్ ఎలా కట్ చేశారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :