ఖరీదైన లొకేషన్లలో షూటింగ్ చేయనున్న ‘సాహో’ టీమ్ !


‘బాహుబలి-2’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయి మారిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘సాహో’ సినిమా కోసం ఒక్క తెలుగు పరిశ్రమ మాత్రమే కాకుండా తమిళ, హిందీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే చిత్ర దర్శకుడు సుజీత్ సింగ్ సినిమా అందరి అంచనాలను అందుకునేలా చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. కేవలం సాంకేతిక్ పరంగానే కాకుండా లొకేషన్ల పరంగా కూడా బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఖరీదైన లొకేషన్లు ముంబై, అబుదాబి, రొమేనియా వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ లొకేషన్లలో ఎక్కువగా హెవీ యాక్షన్ సన్నివేశాలని రూపొందిస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా ‘కత్తి’ ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రూపొందిస్తున్నారు.