బాలీవుడ్ ఖాన్స్ పై ప్రభాస్ రియాక్షన్ ఏంటంటే?

Published on Aug 11, 2019 7:02 pm IST

ట్రైలర్ విడుదల సంధర్బంగా సాహో చిత్ర బృందం నిన్న ముంబైలో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రాంతీయ మీడియా చిత్ర యూనిట్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా వారు ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు అడగడం జరిగింది.

ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్ త్రయం గా పిలవబడే అమీర్,సల్మాన్,షారుక్ లకు మీరు పోటీ ఇవ్వనున్నారా అన్న ప్రశ్నకు, ప్రభాస్ విభిన్నంగా స్పందించారు.థ్యాంక్యూ … ఇక నేను వెళ్లవచ్చా…, అని జస్ట్ ఒక స్మైల్ తోకూడిన సమాధానం చెప్పి, దీనిపై నో కామెంట్ అన్న అర్థంలో సమాధాం చెప్పారు. ఇక పైన కూడా హిందీలో చిత్రాలు చేస్తారా అన్న ప్రశ్నకు, అది మీరే నిర్ణయించాలి,నేను ఇక్కడ ఉండాలా లేదా అని చెప్పారు. ఇక చివరిగా హిందీలో మాట్లాడాలని పట్టుపట్టగా ప్రభాస్ జై హింద్ అని తెలివైన సమాధానంతో తప్పుకున్నారు.

సంబంధిత సమాచారం :