‘సాక్ష్యం’అంత బిజినెస్ చేసిందా !

‘సాక్ష్యం’అంత బిజినెస్ చేసిందా !

Published on Jul 10, 2018 11:48 PM IST

Saakshyam2
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం ‘సాక్ష్యం’. ప్రకృతి నేపధ్య కథతో సాగే ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు జగపతి బాబు, శరత్ కుమార్, మీనా మొదలగు వారు నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది.

ఇక ఈ చిత్రం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు రూ. 40కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ఈ చిత్ర నైజాం ప్రాంత హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.7 కోట్లకు దక్కించుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 27 న ప్రేక్షకులముందుకు రానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు