శబ్దం.. తమిళ్‌లో నిశ్శబ్దం.. కారణమిదే!

శబ్దం.. తమిళ్‌లో నిశ్శబ్దం.. కారణమిదే!

Published on Mar 1, 2025 1:00 AM IST

హీరో ఆది పినిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు అరివళగన్ వెంకటాచలం డైరెక్ట్ చేయగా పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగులో ప్రీమియర్ షోస్‌తోనే ఈ సినిమా సందడి మొదలైంది. కానీ, తమిళ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్. దానికి కొన్ని టెక్నికల్ కారణాలే సమస్యగా నిలిచాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక శుక్రవారం రాత్రి షోలకు ఎలాగైనా సినిమాను రిలీజ్ చేస్తామని వారు తెలిపారు.

థమన్ అందించిన బీజీఎం హైలైట్‌గా నిలిచిన ఈ సినిమా మరి తమిళనాట నిశ్శబ్దం ఎప్పుడు వీడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు