‘సాహో’ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది!

Published on Jul 11, 2018 5:40 pm IST

‘బాహుబలి 2’ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ఈచిత్రం యొక్క ముఖ్యమైన షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో సినిమాకు కీలకం కానున్న సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

‘రన్ రాజా రన్’ ఫెమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల భారీ బడ్జెట్ తో దుబాయ్ లో తెరకెక్కించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More