ఆస్ట్రేలియా వెళ్లనున్న’సాహో’ టీమ్… ఎందుకో తెలుసా?

Published on Jun 11, 2019 3:42 pm IST

‘సాహో’ మూవీని అనుకున్న సమయానికి విడుదల చేయాలని దర్శకుడు సుజీత్ ఏకబిగిన విరామం లేకుండా సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రత్యేకంగా వేసిన పబ్ సెట్లో ఓ ఐటెం సాంగ్ చిత్రీకరించారు. టాకీ పార్ట్ దాదాపు పూర్తిచేసుకున్న ఈ మూవీ పాటల చిత్రీకరణ మిగిలివుంది. ఐతే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్, శ్రద్దా కపూర్ల పై చిత్రీకరించనున్న ఓ పాటకోసం కోసం చిత్ర యూనిట్ వచ్చే వారంలో ఆస్ట్రేలియా వెళ్లనున్నారట. ఈ సాంగ్ ప్రభాస్,శ్రద్దా ల వచ్చే నడిచే ఓ రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది.

ఈ మూవీలో శ్రద్దా కపూర్ కీలకమైన పోలీస్ రోల్ చేస్తున్నారు. చాలా వరకు ప్రభాస్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్న శ్రద్ధా ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలలో కూడా నటిస్తుందని సమాచారం. ప్రభాస్ పాత్ర పై ఇంత వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు చిత్ర యూనిట్. ప్రభాస్ అండర్ కవర్ పోలీసా లేకా సూపర్ మాఫియా లీడర్ అనేది ఈనెల 13 న విడుదలయ్యే టీజర్ లో నైనా హింట్ ఇస్తారేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More