ప్రభాస్ ‘సాహో’ టీజర్: కొంచెం రొమాన్స్, ఇక అంతా యాక్షన్.

Published on Jun 13, 2019 12:11 pm IST

గత మూడురోజులుగా టాప్ ట్రెండింగ్ న్యూస్ గా ఉన్న ‘సాహో’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఇంత ఆసక్తిగా ఎదురుచూసిన ‘సాహో’ టీజర్లో ఏముందో?, ఎలావుందో? ఇప్పుడు చూద్దాం.

టీజర్ ఆసక్తికరంగా శ్రద్ధా కపూర్ చెప్తున్న “బాధైనా, సంతోషమైనా పంచుకోవడాని నాకు ఎవరు లేరు” అనే సెంటిమెంటల్ డైలాగ్ తో ప్రారంభమైంది. వెంటనే వేగం అందుకున్న టీజర్ యాక్షన్ పార్టీలోకి ఎంటరైపోయింది. భారీ చేసింగ్స్, విధ్వంసకమైన యాక్షన్ సీన్స్ ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉన్నాయి. నీల్ నితేశ్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మూవీలో కీలకపాత్రలలో నటించారనిపిస్తుంది. శ్రద్దా గ్లామర్ గర్ల్ కంటే కూడా ప్రభాస్ తో కలిసి విలన్స్ ని విరగదీసే సన్నివేశాలలోనే ఎక్కువ కనిపిస్తుందనిపిస్తుంది. రాక్షసుల్లాంటి ఫారిన్ ఫైటర్స్ తో ప్రభాస్ పోరాటాలు పీక్స్ లో ఉన్నాయి.

ఐతే అసలు ప్రభాస్ రోల్ ఏమిటీ అనేది, టీజర్ లో ఎక్కడా రివీల్ కాలేదు. ప్రభాస్ అండర్ కవర్ కాప్ నా? లేకా సూపర్ దొంగా? అనేది ఇంకా సస్పెన్సు గానే ఉంది. ఏది ఏమైనా ప్రభాస్” సాహో” హాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ లావుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More