ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో చేస్తున్న ప్రయోగాత్మక భారీ సినిమానే రాకా. ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ సెట్ చేసిన ఈ సినిమా భారీ హైప్ సెట్ చేసుకుంది. ఇక దానికి తగ్గట్లుగా ఒక థీమ్ ట్రాక్ కూడా విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సౌండింగ్ పై సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
రాకా కోసం మొదటిసారి అట్లీని కలిసినప్పుడు ఈ సినిమాకి ఎలాంటి సౌండింగ్ ఇవ్వాలి ఎలాంటి ట్రాక్ ఉండాలి అనేది అట్లీకి ఒక క్లియర్ విజన్ ఉంది అని అలా తను రెడి చేసిన ట్రాక్ అట్లీ మరియు అల్లు అర్జున్ లకి ఎంతో నచ్చేసాయి అని తమ టార్గెట్ ఈ సినిమా మ్యూజిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలని ఫిక్స్ అయ్యామని సాయి అభ్యంకార్ తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.


