సాగర్ తీరంలో హీరోయిన్ యోగా పోజ్.

Published on Jun 11, 2019 9:35 am IST

పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కబాలి మూవీ లో రజనీకాంత్ కూతురిగా చేసిన సాయి ధన్సికా మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగు ప్రేక్షలకులకు అంతగా పరిచయం లేని భామ తమిళ్,కన్నడ మూవీస్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఐతే ఈ నటి ఫిట్నెస్ స్ట్రెంగ్త్ చూస్తే మాత్రం మతి పోవాల్సిందే. అమ్మడు చూడడానికి కొంచెం బొద్దుగా కనిపించినా శరీరాన్ని మాత్రం విల్లులా వంచేస్తుంది. కొన్ని రోజుల క్రితం బ్యాక్ ఫ్లిప్ జంప్స్ చేస్తున్న వీడియో ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈమె నేడు సముద్రం తీరాన యోగా భంగిమల్లో కష్టమైన శీర్షాసనం వేస్తున్న ఫొటో ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. తన దిన చర్య ఇలా యోగాతో మొదలౌతుంది ఓ టాగ్ లైన్ కూడా పెట్టింది.

సాయి ధన్సిక ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో”కిత్నా”, అలాగే రామనావ్ దర్శకత్వంలో “వాలుజడ” అనే చిత్రాలలో నటిస్తుంది. ఇవి రెండు తెలుగులో కూడా అనువాదం కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More