మెగా అభిమానులకు సాయి ధరమ్ విన్నపం !

Published on Oct 13, 2018 9:47 pm IST

సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ మెగా అభిమానులను ఉద్దేశించి రిక్వెస్ట్ పెట్టాడు. అక్టోబర్ 15న సాయి ధరమ్ తన 32వ జన్మదినాన్ని జరుపుకోనున్నాడు. దాంట్లో భాగంగా తన పుట్టిన రోజున అభిమానులు కేక్ కట్టింగ్లు , బ్యానర్లు కట్టడం లాంటివి చేస్తున్నారని తెలుసుకున్నాను. ఆలా చేసే బదులు ఆ డబ్బులను ఎవరైనా చిన్నారి చదువుకు ఉపయోగిస్తే నేను ఇంకా సంతోష పడుతాను అని ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరి దీనికి మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక ‘తేజ్ ఐ లవ్ యు’ తరువాత సుమారు 3నెలలు బ్రేక్ తీసుకున్న సాయి ధరమ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆయన కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :