మెగా హీరో వెంటనే మొదలుపెట్టాశాడుగా…!

Published on Nov 19, 2019 8:30 pm IST

సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతిరోజూ పండుగే’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ వచ్చేనెల 20న క్రిస్మస్ కానుగా విడుదల కానుంది. మారుతీ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బ్యూటీ రాశి ఖన్నా సాయి ధరమ్ తేజ్ సరసన మరో సారి నటించింది. కాగా ఈ యంగ్ హీరో వెంటనే మరో చిత్ర షూటింగ్ మొదలుపెట్టేశారు.

సాయిధరమ్ తేజ్ కొద్దిరోజుల క్రితం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్ లో మొదలైంది. దీనిపై ఓ ప్రోమో వీడియో చిత్ర బృందం విడుదల చేసింది. ఎస్విసిసి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More