ఎన్ని అడ్డంకులున్నా సాయి ధరమ్ తేజ్ ముందున్నాడుగా

ఎన్ని అడ్డంకులున్నా సాయి ధరమ్ తేజ్ ముందున్నాడుగా

Published on Dec 19, 2020 2:18 AM IST

solo bathuke
ప్రభుత్వం అనుమతులు ఇచినప్పటికీ సినిమా థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. టికెట్ ధరలు, నిర్వహణ, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటి అంటూ పలు సమస్యలు ఉండటంతో యాజమాన్యాలు హాళ్లను ఓపెన్ చేయలేకపోతున్నారు. మరోవైపు తెలుగు చిత్ర నిర్మాతల మండలికి డిజిటల్ ప్రొవైడర్లకు నడుమ కొన్ని సమస్యలు నడుస్తున్నాయి. సినిమాలు రిలీజ్ చేయడానికి కొన్ని షరతులు పెట్టారు నిర్మాతలు. వాటికి ఒప్పుకుంటేనే రిలీజ్ అంటున్నారు. అలాగే మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు కూడ షరతులు విధించారు.

ఈ సమస్యల నడుమ ఈ నెలాఖరున హాళ్లు తెరుచుకోవడం మీద అనేక సందేహాలున్నాయి. కానీ హీరో సాయి ధరమ్ తేజ్ అండ్ టీమ్ మాత్రం హాళ్లు తెరుచుకుంటాయనే ధీమాతో ఉన్నారు. సినిమా డిసెంబర్ 25న విడుదలవుతుందని ఖచ్చితమైన ప్రకటన చేశారు. అలాగే సినిమా హాళ్ల జాబితాను కూడ విడుదలచేశారు. అంతేకాదు రేపు 19వ తేదీన ఉదయం 11 గంటలు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి తమ సినిమా రిలీజవుతుందని టీమ్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సాయి తేజ్ సరసన నభా నటేష్ కథానాయకిగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు