సాయి ధరమ్‌ తేజ్‌ హెల్త్ కండీషన్ ప్రస్తుతం ఎలా ఉందంటే..!

Published on Sep 22, 2021 9:19 pm IST


మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సాయి తేజ్ కోలుకుంటున్నాడని, వెంటిలేటర్‌ను కూడా తొలగించినట్టు తెలుస్తుంది. ఆరోగ్యం మెరుగై కళ్లు తెరిచి కూడా చూస్తున్నాడని వైద్యులు తెలిపారు.

అయితే ఇటీవలే సాయి తేజ్‌ని ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. సొంతంగానే శ్వాస తీసుకుంటూ అందరితో మాట్లాడగలుగుతున్నారని, మరో రెండు మూడు రోజుల్లో తేజ్‌ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :