“సోసోగా” పాటను విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్

Published on Aug 16, 2021 5:29 pm IST


సంతోష్ శోభన్, మెహ్రిన్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేయడం జరిగింది. మంచి రోజులు వచ్చాయి చిత్రం నుండి సో సో గా పాటను విడుదల చేయడం పట్ల సాయి ధరమ్ తేజ్ సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుంది అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రం నుండి సో సో గా పాటను విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ పాటను విడుదల చేయడం పై దర్శకుడు మారుతి స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పాటను విడుదల చేసినందుకు థాంక్స్ డార్లింగ్ అని అన్నారు. సో సో గా పాటకి కే కే లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. యూ వీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్ మరియు ఎస్కేఎన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :