విలక్షణ నటుడు ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘‘శంబాల’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. గత ఏడాది డిసెంబర్‌లో ‘శంబాల’ ఫస్ట్ పోస్టర్ నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీజర్‌ను దుల్కర్ గారు రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు, నాని గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌లు అంచనాల్ని పెంచేశాయి. యుగంధర్ ముని అద్భుతంగా తీశాడు కాబట్టే ఈ రోజు చిత్రంపై హైప్ ఏర్పడింది. దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు. ప్రవీణ్ విజువల్స్, శ్రీచరణ్ ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. ‘శంబాల’లో అందరూ అద్భుతంగా నటించారు. థియేటర్లో అందరూ మా మూవీని చూసి సర్ ప్రైజ్ అవుతారు. ‘శంబాల’తో మేం డిసెంబర్ 25న హిట్టు కొట్టబోతోన్నాం.’ అని అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘2011లో ‘ప్రేమ కావాలి’తో ఆది హీరోగా పరిచయం అయ్యాడు. జయాపజయాలు అందరికీ సహజమే. కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ‘శంబాల’తో ఆదికి విజయం దక్కబోతోంది. నిజంగానే మునిలా యుగంధర్ ఈ మూవీని రూపొందించారు. గత డిసెంబర్‌లో రిలీజ్ చేసిన పోస్టర్ నుంచి ఇప్పటి వరకు పాజిటివిటీ ఏర్పడుతూనే వచ్చింది. దుల్కర్, ప్రభాస్, నాని ఇలా అందరూ ‘శంబాల’కు సపోర్ట్ చేశారు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారు. కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి, ప్రియదర్శి ఇలా అందరూ నాకు ఫ్యామిలీ లాంటివారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మా కోసం నిలబడిన అభిమానులకు థాంక్స్. అభిమానుల పేరు, నా పేరుని ఈ సారి ఆది నిలబెడతారు. మైత్రి శశి గారు ఈ మూవీని చూసి హిట్ అవుతుందని చెప్పడంతో కాస్త ఉపశమనం కలిగించింది. ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. ‘శంబాల’ డిసెంబర్ 25న కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. ‘నిర్మాత రాజశేఖర్ గారి వల్లే ఈ ‘శంబాల’ స్టార్ట్ అయింది. ఆ తరువాత కథను మహీధర్ గారికి కూడా చెప్పాం. ఆ ఇద్దరే ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌లా నిల్చున్నారు. అన్ని రకాల ఎమోషన్స్ పండించే హీరో కావాలని నిర్మాతలకు చెప్పాను. ఆ తరువాత ఆది గారు మా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆయనకు కూడా కథ చాలా నచ్చింది. నాకు అండగా నిలిచిన ఆది గారికి థాంక్స్. నా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీయగలిగాను’ అని అన్నారు.
నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘శంబాల’ కోసం టీం అంతా చాలా కష్టపడింది. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. డిసెంబర్ 25న రాబోతోన్న మా సినిమాను అందరూ చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత రాజశేఖర్ అన్నభిమోజు మాట్లాడుతూ .. ‘‘శంబాల’ చిత్రం చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 25న మా మూవీ రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ .. ‘‘శంబాల’ నిర్మాతలకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. యుగంధర్‌కి సౌండింగ్ మీద మంచి పట్టుంది. ప్రవీణ్ గారి విజువల్స్ బాగుంటాయి. ఇది నా 49వ చిత్రం. ‘శంబాల’ నా కెరీర్‌లో ఎంతో స్పెషల్ మూవీ. ఆదితో ఇది వరకే కలిసి పని చేశాం. ఈ మూవీతో ఆదికి మంచి విజయం రాబోతోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
అర్చనా అయ్యర్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఎంతో మంది అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పని చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఆది గారి చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, మంచు మనోజ్, అనిల్ రావిపూడి, తమన్, అశ్విన్ బాబు, టీజీ విశ్వప్రసాద్, ప్రియదర్శి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


