సాయికుమార్‌ దంపతులకు చిరు, వెంకీ శుభాకాంక్షలు !

Published on Jul 25, 2021 10:53 pm IST

మాజీ హీరో, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయికుమార్‌ తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్నారు. అయితే, సాయికుమార్‌ తన సతీమణి సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, రాజశేఖర్ – జీవిత, అలాగే విక్టరీ వెంకటేశ్‌ మరియు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు సాయికుమార్‌ దంపతులకు షష్టిపూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి కుమార్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అలాగే హీరోగా పలు సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించారు. ముఖ్యంగా పోలీస్ స్టోరీలో ఆయన పోషించిన పాత్ర కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోయింది.

సంబంధిత సమాచారం :