నా 40 ఏళ్ళ కెరీర్లో మరచిపోలేని సినిమా ఎవడు – సాయి కుమార్
Published on Jan 8, 2014 7:54 pm IST

Sai-Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సినిమా ‘ఎవడు’. పలుసార్లు వాయిదాపడిన ఎవడు సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి ప్రత్యర్ధిగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ధర్మ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘నా సినీ కెరీర్లో ఎన్నిసినిమాలు చేసినా ఒక భారీ బడ్జెట్ సినిమాలో చేయలేదనే ఫీలింగ్ ఉండేది, అది ఎవడు సినిమాతో తీరిపోయింది. నా 40 ఏళ్ళ కెరీర్లో మరచిపోలేని సినిమా ఎవడు. భయపెట్టే వాడికి, భయమంటే ఏమిటో తెలియని వాడికి మధ్య జరిగిన యుద్దమే ఎవడు అని’ అన్నారు.

రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘ రామ్ చరణ్ కి నాకు మధ్య పవర్ఫుల్ సీన్స్ ఉంటాయి. నాకన్నా ఎక్కువ డైలాగ్స్ చరణ్ కి ఉంటాయి. అతనేమో ప్రతి సన్నివేశానికి నా దగ్గరికి వచ్చి బాబాయ్ ఈ డైలాగ్ ని ఇలా చెబితే బాగుంటుందా అని చిన్న చిన్న విషయాలను కూడా అడిగి తెలుసుకునే వాడు. పనిపట్ల ఎంతో శ్రద్ధ ఉన్న వ్యక్తి. ఎవడు సినిమాతో రామ్ చరణ్ అభిమానులకి పండగే అని’ అన్నాడు.

శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook