ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన డైలాగ్ రైటర్ !

Published on Dec 29, 2018 5:42 pm IST


క్రిష్ దర్శకత్వంలో లెజండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవిత కథ తో ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నచిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈచిత్రానికి ప్రముఖ డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. ఈ సందర్బంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో సాయి మాధవ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బాలకృష్ణ గారికి మాటలు రాయడం నా అదృష్టం అలాగే అంత గొప్ప మహానుభావుడి బయోపిక్ కు పనిచేయడం ఆనందంగా వుంది. ఈసినిమాలో ప్రతి ఒక్క పాత్ర కు ఎంతో ఆనందంతో మాటలు రాశాను . ఎన్టీఆర్ గారికి ఎంత గొప్ప చరిత్ర ఉందో అంతే గొప్పగా ఈ సినిమా ఉంటుంది. ఆయన పాత్రకి బాలకృష్ణ గారు తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం కాని కాంట్రవర్సి లేకుండా నిజాలు మాత్రమే ఈసినిమాలో చూపెట్టనున్నాం.

ఈ రెండు భాగాలు కలిసి మొత్తం 70 రోజుల్లో షూటింగ్ పూర్తి అయ్యింది. ఎన్టీఆర్ జీవితం ఒక చరిత్ర అయితే ఈ సినిమా మేకింగ్ ఒక చరిత్ర. సినిమాలో మీరు వూహించినవి అన్ని ఉంటాయి. రామారావు గారి సినిమాకు మాటలు రాయడం అంటే ఆయనకు డైలాగ్స్ రాసినట్టే అందుకే ఈ రెండు భాగాలను ఛాలెంజ్ గా తీసుకొని మాటలు రాశాను. ఈ సినిమాలో ఏ పాత్ర కూడా కల్పితంగా అనిపించదు.

ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి సైరా కు అలాగే రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కు మాటలు రాస్తున్నాను. ఈ రెండు చిత్రాలు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయని ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More