మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకున్న సాయి పల్లవి !


‘ ప్రేమమ్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవికి దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాలో నటిస్తున్న ఈమె ఈ మధ్యే నేచ్యురల్ స్టార్ నాని చేయనున్న కొత్త సినిమాకి సైన్ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది.

అది మాత్రమే కాకుండా తెలుగులో మరో యంగ్ హీరో సరసన కూడా ఆమె హీరోయిన్ గా కుదిరినట్టు తెలుస్తోంది. రోబో చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ యువ హీరో నాగ శౌర్యతో ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. జూన్ లేదా జూలైలో మొదలుకానున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తారట.