నక్సలైట్ పాత్రలో ఫిదా బ్యూటీ !

Published on Dec 16, 2018 10:00 am IST

‘నీది నాది ఒకే కథ’ తో విమర్శకుల ప్రంశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల మరో సారి వైవిధ్యమైన కథతో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. రానా , సాయి పల్లవి జంటగా ఒక చిత్రాన్నితెరకెక్కించనున్నాడు వేణు. ఈచిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనుందని సమాచారం అలాగే రానా పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడట. 1990 లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక సాయి పల్లవి నటించిన ‘పడి పడి లేచె మనసు’ అలాగే ‘మారి 2’ డిసెంబర్ 21న ఒకే రోజు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలపై తెలుగు , తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటు ఆమె ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘ఎన్ జి కె’ చిత్రంలో కూడా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :