‘లిప్ లాక్’ ఉందని సినిమా వదులుకుందట !

Published on Jul 16, 2019 10:25 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా ‘డియర్ కామ్రేడ్’తో ఈ నెల 26న రాబోతున్నారు. ఇప్పటికే వినూత్నమైన ప్రమోషన్స్ తో ‘డియర్ కామ్రేడ్’ ఆకట్టుకుంటున్నాడు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారట. సాయి పల్లవికి కూడా కథ నచ్చింది. కానీ లిప్ లాక్ సీన్స్ లో నటించే ప్రసక్తే లేదని స్పష్టం చెయ్యడంతో సాయిపల్లవి ప్లేస్ లో రష్మిక మండన్నను హీరోయిన్ గా తీసుకున్నారు.

మొదటినుంచీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వస్తోన్న సాయిపల్లవి ఎట్టిపరిస్థితుల్లో లిప్ లాక్ సీన్స్ చేయనని గతంలోనే చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే డియర్ కామ్రేడ్ ను వదులుకుంది. ఇక ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో రష్మిక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోండగా.. విజయ్ దేవరకొండ సోషల్ భావాలు ఉన్న స్టూడెంట్ గా.. టిపికల్ లవర్ గా కనిపించనున్నాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మరి విజయ్ దేవరకొండకు ‘డియర్ కామ్రేడ్’ ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More