రీరికార్డింగ్‌ తో నెక్ట్స్‌ లెవల్‌ కు తీసుకువెళ్లారు – సాయిపల్లవి

Published on May 1, 2019 3:00 am IST

తమిళ స్టార్ హీరో సూర్య 36వ చిత్రంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్.జి.కె’ (నంద గోపాలకృష్ణ) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల కార్యకమ్రం చిత్ర యూనిట్‌ సభ్యుల నడుమ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ – ”ఈ సినిమాలో పనిచేయడం స్కూల్‌కి వెళ్లినట్లుగా అనిపించింది. సూర్యగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. సెట్స్‌లో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనలో సగం నేర్చుకుంటే చాలు. ఆయన మిలియన్స్‌లో ఒకరు. ఇక యువన్‌ గారితో నేను చేస్తోన్న రెండో సినిమా. పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్‌తో సినిమా నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళతారు” అన్నారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., పాటలు: చంద్రబోస్‌, రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, రచన, దర్శకత్వం: శ్రీరాఘవ.

సంబంధిత సమాచారం :