సాయి పల్లవి రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి !

Published on Aug 30, 2018 8:50 am IST

‘ఫిదా’ ఫెమ్ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ తో కలిసి ‘పడి పడి లేచె మనుసు’, తమిళంలో సూర్య ‘ఎన్ జి కె’ , ధనుష్ ‘మారి 2’చిత్రాల్లో నటిస్తుంది. ఇక ఈసినిమాల్లో మొదటగా సూర్య ‘ఎన్జికె’ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం రాజమండ్రి లో షూటింగ్ జరుపుకుంటున్నఈచిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి మీరా అనే పాత్రలో నటిస్తుంది.

ఇక శర్వానంద్ తో కలిసి నటిస్తున్న ‘పడిపడిలేచె మనుసు’ షూటింగ్ కూడా చివరి దశలో వుంది. ఈసినిమా డిసెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది. ఈచిత్రంలో సాయి పల్లవి డాక్టర్ పాత్రలో నటిస్తుంది. ఇక ధనుష్ తో కలిసి నటిస్తున్న’మారి 2′ ఇటీవలే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈచిత్రంలో సాయి పల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకూడా డిసెంబర్ 21నే విడుదలకానుందని సమాచారం. మొత్తానికి సాయి పల్లవి అభిమానులను ఒకే రోజు రెండు సినిమాలతో ఫిదా చేయనుంది.

సంబంధిత సమాచారం :

More