పవన్ సినిమాలో సాయి పల్లవి..వీటిలో ఏ సినిమాకు.?

Published on Nov 25, 2020 9:00 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు ప్రాజెక్టులను లైన్ లో పెట్టడమే కాకుండా మరోపక్క పాలిటిక్స్ ను కూడా బ్యాలన్స్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు పవన్ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఒక్కో సినిమాపై ఒక్కో రకమైన అంచనాలు నెలకొన్నాయి.

అలా లేటెస్ట్ గా వినిపించిన గాసిప్ ప్రకారం పవన్ మరియు క్రిష్ జాగర్ల మూడి కాంబోలో వస్తున్న పీరియాడిక్ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది అని టాక్ వచ్చింది. అయితే గత కొన్నాళ్ల కితమే ఇదే సాయి పల్లవి పవన్ చేసే మరో సాలిడ్ ప్రాజెక్ట్ “అయ్యప్పణం కోషియం” రీమేక్ లో కూడా ఉంటుంది అని గాసిప్స్ వినిపించాయి.

దీనితో ఈ స్టార్ హీరోయిన్ పవన్ తో రెండు సార్లు స్క్రీన్ పంచుకోనుందా అన్న హాట్ టాపిక్ ఇప్పుడు మొదలు అవ్వనుంది. మరి సాయి పల్లవి నిజంగానే రెండు సినిమాల్లో పవన్ సరసన కనిపిస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More