సాయి తేజ్ సినిమా ఆ రేస్ లో నిలవనుందా?

Published on Oct 30, 2020 11:00 am IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యువ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు. అవ్వడానికి మెగా మేనల్లుడు అయినా తనదైన మార్కెట్ ను మన టాలీవుడ్ లో సాయి తేజ్ ఏర్పరచుకున్నాడు. అలా రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్స్ అనుకోని కం బ్యాక్ ఇచ్చిన ఈ హీరో ఇపుడు హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.

అలా నూతన దర్శకుడు సుబ్బుతో ప్లాన్ చేసిన లేటెస్ట్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాపై తన అంచనాలు పెట్టుకొన్నాడు. అయితే ఈ చిత్రం కూడా లాక్ డౌన్ వలన ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. కానీ ఎట్టకేలకు మిగిలిన షూట్ ను పూర్తి చేసుకుని ఇటీవలే క్లీన్ యూ తో సెన్సార్ ను పూర్తి చేసుకొని థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయ్యింది.

అయితే ఈ మధ్య థియేటర్స్ తెరుస్తున్న నేపథ్యంలో మన టాలీవుడ్ చాలా సినిమాలు సంక్రాంతి రేస్ కు రెడీ అయ్యిపోయాయి. కానీ సాయి తేజ్ మాత్రం ఇంకా ముందు గానే పలకరించనున్నాడని తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ రేస్ లో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారట. అప్పటికి పరిస్థితులు మరింత మెరుగవ్వొచ్చని మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తుండొచ్చు. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More