క్లీన్ యూ తో గ్రాండ్ రిలీజ్ కు సెట్టయిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

Published on Oct 21, 2020 10:09 pm IST


మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ హీరోగా పరిచయం అయిన హీరో సాయి ధరమ్ తేజ్ తనకంటూ మంచి గుర్తింపు మరియు డీసెంట్ మార్కెట్ ను ఏర్పరచుకొని పలు ప్రాజెక్టులను చేస్తున్నారు. రీసెంట్ గా మంచి కం బ్యాక్ ను అందుకొని అదే జోరు కొనసాగించాలని నూతన దర్శకుడు సుబ్బుతో ప్లాన్ చేసిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”.

లేటెస్ట్ సెన్సేషన్ నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఊహించని విధంగా లాక్ డౌన్ వచ్చేసరికి ఆగాల్సి వచ్చింది. అలా ఇటీవలే షూట్ ను ముగించుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా సెన్సార్ ను పూర్తి చేసుకున్నట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు తెలిపారు. తమ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ రాగా గ్రాండ్ విడుదలకు తమ చిత్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సాయి తేజ్ ఇదే బ్యానర్ లో మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ను చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More