‘రిపబ్లిక్’ తన కెరీర్లో స్పెషల్ మూవీ అవుతుందంటున్న తేజ్

Published on Feb 23, 2021 4:00 pm IST

మెగా హీరో సాయి తేజ్ చేసున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సాయి తేజ్ మొదటిసారి చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. నాలుగు నెలల పాటు ఆగకుండా షూటింగ్ చేశారు టీమ్. కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడ సినిమా షూటింగ్ జరిపారు. అయినా ఎలాంటి కోవిడ్ కేసులు లేకుండానే చిత్రీకరణను ముగించారు. ఈ సినిమా పట్ల తేజ్ మొదటి నుండి చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా తన కెరీర్లో స్పెషల్ మూవీ అవుతుందని అంటున్నారు తేజ్.

ఇటీవల విడుదలైన సినిమా మోషన్ పోస్టర్ సైతం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దేవ కట్ట గతంలో చేసిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రస్థానం’ మంచి పేరు తెచ్చుకోవడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తుండగా ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :