ప‌ద్మ‌శ్రీ వస్తే ఈ హీరో ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట !

Published on May 15, 2019 11:00 pm IST

ఓ నటుడుకి ప‌ద్మ‌శ్రీ పురుస్కారం వచ్చిదంటే అదేంతో గౌరవంగా భావిస్తారు. కానీ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మాత్రం తనకు ప‌ద్మ‌శ్రీ పురుస్కారం వచ్చినందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట. ఈ విషయాన్ని సైఫ్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అర్భాజ్ ఖాన్ నిర్వ‌హిస్తున్న ఓ షోకి అతిధిగా వచ్చిన సైఫ్ ప‌ద్మ‌శ్రీ పురస్కారం ఆస‌క్తిక‌రమైన కామెంట్స్ చేశాడు.

సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. ‘ ట్విట‌ర్‌ లో కొంతమంది నెటిజన్లు నేను ఏదో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని కొనుక్కున్నాన‌ని విమర్శించారు. నిజం చెప్పాలంటే.. వారి విమర్శల్లో అర్ధం ఉంది. ఎందుకంటే నా కంటే చాలామంది ప్ర‌తిభ ఉన్న న‌టుల‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం రాలేదు. విచిత్రంగా నాకు వచ్చింది. నాకంటే గొప్ప నటులకు రాకుండా నాకు వచ్చినందుకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ప‌ద్మ‌శ్రీని వెన‌క్కి తిరిగి ఇచ్చేయాల‌ని అనుకున్నాను. మా నాన్నగారు నువ్వు భార‌త ప్ర‌భుత్వాన్ని తిర‌స్క‌రించే స్థాయిలో లేవు అని చెప్పారు. దాంతో ప‌ద్మ‌శ్రీని అందుకున్నాను అని తెలిపారు సైఫ్ అలీఖాన్.

సంబంధిత సమాచారం :

More