ఆగష్టు నెలాఖరున విడుదలకానున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ !

ఆగష్టు నెలాఖరున విడుదలకానున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ !

Published on Jul 3, 2018 11:14 AM IST

నాగ చైతన్య చేస్తున్న సినిమాల్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడ ఒకటి. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు ముగిసింది. దీంతో చిత్ర యూనిట్ రిలీజ్ పనుల్ని మొదలుపెట్టారు. ఆగష్టు నెల 31వ తేదీన ఈ చిత్రాన్ని విడుదలచేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. మారుతి గత చిత్రం ‘మహానుభావుడు’ మంచి విజయాన్ని సాధించి ఉండటం, చైతు తొలిసారి మారుతితో సినిమా చేస్తుండటంతో ఈ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణగారు ఒక కీలక పాత్ర చేస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు