శైలజారెడ్డి అల్లుడు అంత రాబట్టగలడా ?

Published on Sep 11, 2018 2:04 am IST

మొదటి సారి మారుతీ ,నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ‘శైలజారెడ్డి అల్లుడు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 13న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగిందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈచిత్ర విడుదల హక్కులు 19కోట్ల కు అలాగే ఇతర రాష్ట్రాలు,ఓవర్శిస్ లలో కలిపి మరో 5కోట్ల వరకు అమ్ముడయ్యాయని సమాచారం.

అంటే ఈలెక్కన ఈచిత్రం 24 కోట్ల వసూళ్లను సాధిస్తే తప్ప సేఫ్ అవ్వదు. ఇక చైతు నటించిన సినిమాల్లో ఈరెంజ్ లో బిజినెస్ చేసిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. మారుతీ గత చిత్రం’ భలే భలే మగాడివోయ్’ 40కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించింది. మరి ఈచిత్రంలో కుడా కామెడీ వర్క్ అవుట్ అయితే 24కోట్లను వసూలు చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. మరి చూడాలి బాక్సాఫిస్ వద్ద ఈ చిత్రం ఏ స్థాయిలో సత్తాచాటుతుందో.

సంబంధిత సమాచారం :