‘సాక్ష్యం’ విడుదల ఎప్పుడంటే !

Published on May 28, 2018 2:54 pm IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. ఈ సినిమా జూన్ 14 న విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేసారు. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్.

ఈ సినిమాని జూలై 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రకృతి నేపధ్య కథతో సాగే ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిశోర్ మొదలగు ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మేకోవర్, విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి .

సంబంధిత సమాచారం :