ప్రభాస్ సలార్ షూటింగ్‌కి బ్రేకులు.. కారణం అదేనా?

Published on Mar 30, 2022 10:09 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల “రాధేశ్యామ్‌” మూవీతో ప్రేక్షకులను పలకరించినా ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్ “సలార్”పై బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తికాలేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడినట్టు టాక్‌ వినిపిస్తుంది. రాధేశ్యామ్‌ రిలీజ్‌ తర్వాత చిన్న సర్జరీ కోసం ప్రభాస్‌ విదేశాలకు వెళ్లాడని, పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని అందుకే ఈ సినిమా షూటింగ్‌ని ప్రస్తుతానికి ఆపేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావించినా షూటింగ్‌ కనుక ఆలస్యమైతే రిలీజ్‌కి మరింత సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :