“సలార్” నెక్స్ట్ షూట్ అప్పటి నుంచి..?

Published on Mar 17, 2021 10:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రబస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “సలార్”. ఇది ఊహించని మాస్ కాంబో కావడంతో దీనిపై పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ బిగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. అలాగే ఇప్పుడు రెండో షెడ్యూల్ కు కూడా రంగం సిద్ధం అవుతుంది.

కొన్ని రోజుల కితమే ఈ చిత్రం తాలూకా రెండో షెడ్యూల్ కు భారీ సెట్ వర్క్ చేస్తున్న టాక్ వచ్చింది. అయితే మరి ఈ షెడ్యూల్ వచ్చే ఏప్రిల్ మూడో వారం నుంచి మొదలు కానున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అప్పటికి పర్ఫెక్ట్ సెట్ వర్క్ పూర్తయ్యి ప్రభాస్ మళ్ళీ ఈ షూట్ లో పాల్గొననున్నాడట. ఇక ఈ గ్యాప్ లో ప్రభాస్ “ఆదిపురుష్” షూట్ ను కొంత మేర కంప్లీట్ చేయనున్నాడని తెలుస్తుంది. మరి ఈ రెండు భారీ చిత్రాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :