వచ్చే ఏడాది సల్మాన్ ఈద్ మూవీ సిద్ధం

వచ్చే ఏడాది సల్మాన్ ఈద్ మూవీ సిద్ధం

Published on Oct 19, 2019 7:39 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది ఈద్ కానుకగా ఒక చిత్రాన్ని విడుదల చేస్తారు. గత కొన్నేళ్లుగా ఆయన ఈ సంప్రదాయం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది రంజాన్ కి భారత్ మూవీని విడుదల చేయడం జరిగింది. కాగా ఆయన 2020 ఈద్ మూవీ ని కూడా సిద్ధం చేశారు. ప్రభుదేవా దర్శకుడిగా రాధే అనే చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్ కి విడుదల చేయనున్నట్లు ప్రకటించడం తో పాటు,ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదలడం విశేషం. బ్లాక్ గ్లాసెస్, జాకెట్ ధరించిన ఉన్న సల్మాన్ గన్ ఫైరింగ్ చేస్తున్న ఆ పోస్టర్ చూస్తుంటే ఆసక్తి రేగుతుంది. కాగా ఈ చిత్రానికి కూడా దర్శకుడు గా ప్రభుదేవా వ్యవహరించడం విశేషం.

ఇప్పటికే సల్మాన్ – ప్రభుదేవా కాంబినేషన్‌లో తెరకెక్కిన దబాంగ్ 3 డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇక తాజా చిత్రం రాధే నవంబర్ 4 నుండి సెట్స్ పైకి వెళ్ళనునుండగా, తొలి షెడ్యూల్ ముంబైలో జరుపుకోనుంది. 2017లో వచ్చిన కొరియన్ చిత్రం ది ఔట్ లాస్‌కి రీమేక్‌గా రాధే మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు